39వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించండి

శ్రీ సత్యసాయి జిల్లా ,కదిరి :

సీపీఎం పార్టీ కౌన్సిలర్ ఆభ్యర్థి ముస్తాక్ అలీ ఖాన్‌ను గెలిపించాలని ఓబులు పిలుపు

కదిరి: కదిరి మున్సిపాలిటీలోని 39వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలంటే సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థి కే. ముస్తాక్ అలీ ఖాన్‌ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఓబులు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం 39వ వార్డులో కే. ముస్తాక్ అలీ ఖాన్‌తో కలిసి సీపీఎం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సీపీఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం పార్టీ పట్టణంలోనూ, 39వ వార్డులోనూ అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. వార్డులో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సీపీఎం అభ్యర్థి కే. ముస్తాక్ అలీ ఖాన్‌ను కౌన్సిలర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సీపీఎంకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.ఎల్. నరసింహులు, నాయకులు సాంబ, జగన్, బాబ్జాన్, రామ్మోహన్, కృష్ణ నాయక్, రమణమ్మ, జయశ్రీ, మున్నీ, అమ్మాజాన్, రమేష్, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News