శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి,
శ్రీ సత్యసాయి జిల్లాలో వాటర్ వర్కర్స్ యూనియన్‌కు చెందిన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు డిమాండ్ చేశారు.
జీతాలు సకాలంలో అందకపోవడంతో వాటర్ వర్కర్స్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి జీతాలు అందకపోవడం వల్ల కార్మికులు అప్పులు చేసి కుటుంబ అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ, వారికి రావాల్సిన వేతనాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలను విడుదల చేయడంతో పాటు, భవిష్యత్తులో జీతాలు ప్రతి నెలా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వాటర్ వర్కర్స్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె నేటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం కార్మికులను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్చలు జరిపి, పెండింగ్ జీతాల విడుదలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని జి. ఓబులు కోరారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు సిఐటియు వారి పోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పైపల్లి గంగాధర, అంకె ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు:
- వాటర్ వర్కర్స్ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలి.
- ప్రతి నెలా జీతాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
- నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి.
- కార్మికుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను తక్షణమే పరిష్కరించాలి. డిమాండ్ చేశారు.



