అక్టోబర్ 16 ఉచిత గుండె శిబిరం.. ఆత్మీయత, యుటిఎఫ్.

.

సత్యసాయి జిల్లా , ధర్మవరం, –

ఆత్మీయ ట్రస్ట్ ,ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం నగరానికి చెందిన మార్క్ హాస్పిటల్ సౌజన్యంతో ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించబడునని ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలియజేశారు. ఉచిత గుండె వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను సోమవారం రోజున యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి స్థానిక యుటిఎఫ్ నాయకులు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపు నందు నందు ఉచితంగా షుగర్ ,బిపి, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును అని ఈ పరీక్షలు మార్క్ హాస్పిటల్ వారి సౌజన్యంతో చేయబడునని తెలియజేశారు.. క్యాంపుకు హాజరయ్యేవారు ముందస్తుగా 9030944717 ,94417 34907 చరవాణి లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు ఆంజనేయులు ,వెంకట కిషోర్ ,జింక హరికృష్ణ ,సకల చంద్రశేఖర్, పెద్దకొట్లసురేష్, లక్ష్మీనారాయణ, జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి ఆత్మీయ ట్రస్ట్ ప్రతినిధి హర్జిత్ ప్రణవ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News