బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – సాకే నరేష్.

అనంతపురం టౌన్:

బి సీ రిజర్వేషన్లు, చట్టాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు

బి సి లకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ సాకే నరేష్ ప్రశ్నలు లేవనెత్తారు. బీసీలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు, వారి హక్కులు, చట్టబద్ధమైన ప్రయోజనాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సాకే నరేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమం, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా మరియు ఉద్యోగ అవకాశాల విషయంలో గతంలో ఇచ్చిన హామీలను విశ్లేషిస్తూ మాట్లాడారు. బీసీల అభివృద్ధి కోసం ప్రకటించిన హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయో ప్రభుత్వం వివరించాలని కోరారు.బీసీలకు సంబంధించిన చట్టాలు, రిజర్వేషన్ల పరిరక్షణ, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాల కల్పన వంటి అంశాల్లో బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీల సంక్షేమం మాటలకే పరిమితం కాకుండా, ఇచ్చిన హామీలను కార్యాచరణ ద్వారా నిరూపించాలని పేర్కొన్నారు.బీసీల హక్కుల పరిరక్షణ కోసం తమ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు తమ గళాన్ని వినిపిస్తామని డాక్టర్ సాకే నరేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు తోపు చంద్ర, రామాంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News