బీసీలకు అన్యాయం చేసిన జగన్.. బీసీల రాజకీయ హక్కులపై సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే

శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి :

బీసీల రాజకీయ భవిష్యత్తుతో చెలగాటమాడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, బీసీలకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ డిమాండ్ చేశారు.

34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయన విమర్శలు చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు బీసీ వర్గాలకు నష్టం కలిగించాయని ఆరోపించారు. బీసీలకు అధికారం అంటే పదవులు మాత్రమే కాదు.. ఆత్మగౌరవం, రాజకీయ గుర్తింపు, సమాన అవకాశాలు! బీసీలను ఓటు బ్యాంకుగా చూడటం కాదు, పాలనలో భాగస్వాములను చేయడమే నిజమైన సామాజిక న్యాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో బీసీలకు జరిగిన నష్టంపై వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడే నైతిక బాధ్యత వైసీపీ నాయకులకు ఉందన్నారు.

బీసీలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!

స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టపరమైన నిబంధనలు, రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.బీసీ సోదరులు తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని, గత ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, బీసీలకు జరిగిన అన్యాయంపై రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన రాజకీయ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధి మా నినాదం.. బీసీలకు రాజకీయ న్యాయం మా లక్ష్యం.. బీసీల ఆత్మగౌరవ పరిరక్షణే మా బాధ్యత! అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News