శ్రీ సత్య సాయి జిల్లా , అమడగూరు,
రూ.13.52 కోట్లతో 52 అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు
అమడగూరు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండలంలో సుమారు రూ.13.52 కోట్లతో చేపడుతున్న 52 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శంకుస్థాపనలు చేశారు.పలు గ్రామాల్లోకి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేరుకున్న సందర్భంగా గ్రామస్తులు హారతులు పట్టి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలు ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు, కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దీంతో ఎమ్మెల్యే పర్యటన ఆద్యంతం అభివృద్ధి కార్యక్రమాలతో బిజీబిజీగా సాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగమైందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.చంద్రబాబు సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పల్లె సింధూర రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ప్రజల మద్దతు లభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పల్లె సింధూర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.


