మడకశిరలో రూ. 1.20 కోట్లతో నూతన ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ

శ్రీ సత్య సాయి జిల్లా , మడకశిర :

పాలనను ప్రజల చెంతకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం:

బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత హాజరైన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

మడకశిర నియోజకవర్గ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు.

మడకశిర పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో రూ. 1.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డివిజనల్ రెవెన్యూ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సవిత,జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు, , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని శంకుస్థాపన పలకను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ మడకశిర నియోజకవర్గం ఎక్కువగా రైతాంగంపై ఆధారపడిన ప్రాంతమని, ఏ పంటనైనా పండించగల గొప్ప సత్తా ఉన్న నేల అని కొనియాడారు.మడకశిర ప్రజలు తమ పనుల నిమిత్తం పెనుగొండ ప్రాంతానికి రావడం పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి సత్యసాయి జిల్లాలో మరొక కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి సభ ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మడకశిర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం స్థానిక నాయకులు, కలెక్టర్, రెవెన్యూ మంత్రి మరియు హోం మంత్రులతో సైతం నిరంతరం సంప్రదిస్తూ పోరాడుతున్నారని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ మరియు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని, పరిశ్రమలు, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మడకశిర ప్రజలు చూపుతున్న మితిమీరిన ప్రేమాభిమానాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. • జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూమడకశిర నియోజకవర్గానికి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ కావాలని స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా, ప్రభుత్వ పరిశీలన అనంతరం నూతన డివిజన్ ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు.గతంలో రెవెన్యూ రికార్డుల్లో జరిగిన పొరపాట్లను (భూమి ఒకరి పేరు మీద, అనుభవంలో మరొకరు, పాస్ పుస్తకాలు ఇంకొకరి వద్ద ఉండటం వంటి సమస్యలు) సరిదిద్దేందుకు రీసర్వే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.రీసర్వే ద్వారా అసలైన యజమానులకు ఎంత విస్తీర్ణం ఉంది, పేరు సరిగ్గా ఉందో లేదో ఇ-కేవైసీ (e-KYC) ద్వారా ముందుగానే సరి చూసుకున్న తర్వాతే ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తుందని స్పష్టం చేశారు.ఇప్పటి వరకు 165 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మార్చి 2027 నాటికి మిగిలిన అన్ని గ్రామాల్లో పూర్తి చేసి రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మడకశిర నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాలతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రజలు కృషి చేయాలని కోరారు. • ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ.మడకశిర, అమరాపురం ప్రాంత అభివృద్ధి & టవర్లుమన పార్లమెంట్ పరిధిలోని 6 మంది శాసనసభ్యుల ద్వారా అత్యధిక సంఖ్యలో టవర్లను తీసుకువచ్చామని తెలియజేశారు.ఇంకా మడకశిర మరియు అమరాపురం వంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో టవర్లు రావాల్సిన అవసరం ఉందని, వాటిని ఈ బడ్జెట్‌లో తప్పకుండా తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గతంలో జిల్లా పరిషత్ ఛైర్మన్‌గాను, ఎమ్మెల్యేగాను, ఇప్పుడు ఎంపీగాను ఈ ప్రాంతానికి గరిష్ట స్థాయిలో నిధులు మరియు అభివృద్ధి పనులు తీసుకువచ్చానని గుర్తుచేశారు.ఈ ప్రాంత రుణాన్ని ఎప్పటికీ తీర్చుకుంటానని చెప్పారు.2019 నుండి 2024 మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 1,000 కోట్లు కాక కనీసం రూ. 5 కోట్లు కూడా వెచ్చించలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంత దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఆనాడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారు హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభించగా, దానిని పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని అన్నారు.సుమారు రూ. 3,000 కోట్ల నిధులు వెచ్చించి మాల్యాల నుండి కుప్పం వరకు హంద్రీ-నీవా ద్వారా సాగునీరు/తాగునీరు అందిస్తున్నారని, మడకశిర ప్రాంతానికి కూడా ఇవి అందుతాయని వెల్లడించారు.•మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో ప్రాంతీయంగా వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నామని పేర్కొన్నారు. భూమిపూజ కార్యక్రమం అనంతరం నూతన ఆర్డీఓ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు ప్రారంభించి, స్వయంగా డ్రైవ్ చేశారు.ఈ భూమిపూజ మహోత్సవంలో ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి,తహసీల్దార్ ముకుంద,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, మడకశిర పట్టణ ప్రముఖులు,కూటమి నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News