తహాశీల్దారుకి సమ్మె నోటీసు అందించిన విఆర్ఏలు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి :

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో విఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నారని అందులో భాగంగా మంగళవారం (నేటి) నుంచి కదిరి లో ప్రతి వీఆర్ఏ ఈ ఉద్యమంలో పాల్గొంటున్నామని కదిరి తహాశీల్దారు రెడ్డి శేఖర్ కి సమ్మె నోటీసు అందించారు
విఆర్ఏ డిమాండ్లు
1.గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కెలు తెలంగాణ మాదిరి ఇవ్వవలెను.
2.అర్హత ఉన్న గ్రామ రెవిన్యూ సహాయకులకు విఆర్ఓ ప్రమోషన్లు కల్పించవలెను.
3.విఆర్ఏ లకు అటెండర్ & వాచ్మాన్ ప్రమోషన్లు ఇవ్వాలి.
4.ప్రమోషన్ కోటాను 30%నుండి 70% కు పెంచాలి.
5.నామినల్ వీఆర్ఏ లుగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ గ్రామ రెవెన్యూ సహాయకులుగా నియమించాలి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని న్యాయమైన కోరికలను పై అధికారులకు మరియు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల కదిరి మండలం అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, చంద్రశేఖర్ , కృష్ణమ్మ, నరసింహులు, నాగభూషణం, వెంకటేష్, గంగాధర, పవన్ తదితరులు ఉన్నారు…

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News