ప్రజా సమస్యకు తక్షణ పరిష్కారం… రైతన్న ముఖంలో చిరునవ్వు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ,

• రీ-సర్వేలో ప్రభుత్వ భూమిగా మారిన ల్యాండ్‌ను తిరిగి రైతు పేరు పైకి మార్చిన జిల్లా జాయింట్ కలెక్టర్

  • పిజిఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు


నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన రైతు మాసే నాగేశ్వర మరియు వారి నలుగురు అన్నదమ్ములకు న్యాయం చేకూరుస్తూ, వారి పేర్లను తిరిగి రెవెన్యూ రికార్డులు (అడంగల్) నందు చేర్చాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రీ-సర్వే కార్యక్రమంలో దొర్లిన సాంకేతిక పొరపాట్ల వల్ల ప్రభుత్వ భూమిగా నమోదైన తమ భూమిని తిరిగి రికార్డుల్లో చేర్చి న్యాయం చేసినందుకు గాను శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులకు రైతు మాసే నాగేశ్వర వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసిన రైతులు జాయింట్ కలెక్టర్‌ను నేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. గోపేపల్లి గ్రామ పొలం సర్వే నెంబరు 246 నందు ఉన్న భూమికి సంబంధించి 2014వ సంవత్సరంలో అసైన్‌మెంట్ కమిటీ ద్వారా అర్హత మేరకు మాసే నాగేశ్వర మరియు వారి అన్నదమ్ములకు డి-పట్టాలు మంజూరయ్యాయి. నాటి నుండి వారు సదరు భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే, ఇటీవల నిర్వహించిన రీ-సర్వే కార్యక్రమంలో సాంకేతిక పొరపాట్ల వల్ల వీరి పేర్లను తొలగించి, ఆ భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు చేశారు. తన భూమిని తిరిగి రికార్డుల్లో నమోదు చేయాలని బాధితుడు మాసే నాగేశ్వర ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీ సమర్పించారు. ఈ అర్జీపై స్పందించిన నల్లమాడ తహసీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి మరియు పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. రైతులు నిరంతరం సాగులో ఉన్నారని, వారికి భూమిపై పూర్తి హక్కులు ఉన్నాయని ధృవీకరిస్తూ సమగ్ర నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించారు. అడంగల్‌లో పేరు నమోదు.. అధికారుల నివేదిక ఆధారంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని, రీ-సర్వే రికార్డులను సరిచేసి, సదరు సర్వే నెంబరు 246 లోని భూమిని అడంగల్ నందు తిరిగి మాసే నాగేశ్వర మరియు వారి అన్నదమ్ముల పేరిట నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమి రీ-సర్వేలో చేయిదాటిపోయిందన్న ఆందోళనలో ఉన్న తమకు, అర్జీ ఇచ్చిన స్వల్ప వ్యవధిలోనే స్పందించి న్యాయం చేసినందుకు గాను రైతు మాసే నాగేశ్వర మరియు వారి కుటుంబ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News