శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి:
స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన కూటమి పార్టీలతో సమన్వయం.
• బలమైన అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ
•కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో యస్. విష్ణువర్ధన్ రెడ్డి
కదిరి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు, బీజేపీ ఆల్ సెల్ జాతీయ కో-కోఆర్డినేటర్ యస్. విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలు, నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామం, మండలంలో పార్టీకి అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ రూపొందించడంపై నేతలు దృష్టి సారించారు.కూటమి పార్టీలతో సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొనే అంశం సమావేశంలో ప్రధానంగా చర్చించారు. స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకుని పోటీ చేసే స్థానాలపై ప్రణాళిక రూపొందించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా ప్రజల్లో మంచి పేరు, పార్టీ పట్ల నిబద్ధత, క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఉన్న సమర్థులైన అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా యస్. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమర్థవంతమైన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలని అన్నారు.కదిరి నియోజకవర్గంలో బీజేపీకి బలమైన రాజకీయ పునాది నిర్మించడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉత్తమ రెడ్డి, సుదర్శన్, పి.టి. ఆంజనేయులు, వెంకటేష్, జిల్లా మీడియా ఇన్చార్జ్ డీ.ఎల్. ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కేతే గిరిజమ్మ, మేకల నాగార్జున, ప్రతాప్, మైనారిటీ నాయకులు ఇంతియాజ్ ,షేక్ మైనుద్దీన్, బెల్లాల్, ఉత్తమ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షులు షేక్ బాబ్జాన్, ఎర్రంశెట్టి రమేష్ బాబు, వేమ నారాయణ, బాబు రెడ్డి, నందిశెట్టి బాబు ,రవిచంద్ర నాయుడు ,రంగారెడ్డి, ఓబుల్ రెడ్డి ,మంజునాథ్ రెడ్డి ,శివ ప్రసాద్ రెడ్డి, నాగేశ్వరి, నాగవర్ధన్ రెడ్డి, జనార్ధన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..


