సి ఎస్ ఆర్ నిధులతో పెనుకొండలో రైతు బజార్ నిర్మాణం

మొదటి దశలో 48 స్టాళ్లు.. రెండో దశలో 200 స్టాళ్ల ఏర్పాటు

అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం: మంత్రి సవిత

శ్రీ సత్యసాయి జిల్లా , పెనుకొండ,
పట్టణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెనుకొండ మార్కెట్ సమీపంలో రూ.1 కోటి సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న రైతు బజార్‌కు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాశ్యామ్ ప్రసాద్ తో కలిసి శనివారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేలా, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులో ఉండేలా రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి దశలో 48 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నామని, రెండో దశలో మరో 200 స్టాళ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.పెనుకొండ పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.అలాగే పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికలకు ముందే 1,500 మందికి పట్టాలు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. పెనుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News