స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

గ్రీన్ స్పేస్’ ‘పబ్లిక్ టాయిలెట్’ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా , మడకశిర


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు శనివారం మడకశిర నగర పంచాయతీ పరిధిలో పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మడకశిర నగర పంచాయతీ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద గ్రీన్ స్పేస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన’పబ్లిక్ టాయిలెట్’ లను కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, పట్టణాల ఆహ్లాదకరమైన వాతావరణానికి మొక్కల పెంపకం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను అధికారులు, మున్సిపల్ సిబ్బంది తీసుకోవాలని ఆదేశించారు. పట్టణాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే వీటి నిర్వహణను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మడకశిర మున్సిపల్ కమిషనర్,మడకశిర తహసీల్దార్ ముకుంద,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి,నగర పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News