కలెక్టర్ బంగ్లాలో ఘనంగా వినాయక నిమజ్జనం, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన శ్రీ వినాయక చవితి వేడుకలు బుధవారం నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిసాయి. రెండు రోజులుగా కలెక్టర్ బంగ్లాలో ప్రత్యేక పూజలు అందుకున్న గణపతి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ప్రత్యేక పూజలు, హారతి సమర్పించి యథావిధిగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… విఘ్నేశ్వరుని ఆశీస్సులతో శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలో చేపడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ సిబ్బంది ఇతర అధికారులు మరియు కలెక్టర్ కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News