బ్లూమూన్ స్కూల్ లో ఘనంగా విద్యార్థి నాయకుల ఎంపిక

శ్రీ సత్య సాయి జిల్లా , కదిరి :స్థానిక గంగమ్మ మోరి ఎదురుగా ఉన్న బ్లూ మూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూల్ హెడ్ బై హెడ్ గర్ల్,డిప్యూటీ హెడ్ బై హెడ్ గర్ల్,కల్చరల్ హెడ్ బై హెడ్ గర్ల్,స్పోర్ట్స్ కెప్టెన్,హౌస్ కెప్టెన్ లను ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ ఉపయోగించి విద్యార్థుల చేత ఓటు వేపించి అత్యధిక ఓట్లు వచ్చిన విద్యార్థిని విద్యార్థులను వివిధ కేటగిరీల కెప్టెన్లగా ఎన్నుకోవడం జరిగిందని బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత ఎం. శివ శంకర్ తెలియజేశారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయని విద్యాసంస్థల డైరెక్టర్ మౌనిక తెలియజేశారు, ఎన్నికైన విద్యార్థినీ విద్యార్థులు తమ విధివిధానాలను సమర్థంగా నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి .సురేందర్ రెడ్డి తెలియజేశారు, నూతనంగా ఎన్నిక కాబడిన వివిధ కేటగిరీల కెప్టెన్లను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ సి. మాధవరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు జి. రామాంజుల రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News