మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో విద్యార్థుల ప్రభంజనం

శ్రీ సత్యసాయి జిల్లా , ఓ.డి. చెరువు:

మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో విద్యార్థుల ప్రభంజనం

వరుసగా నాలుగో ఏడాది ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం

ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో
మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వరుసగా నాలుగో సంవత్సరం కూడా ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని, సెప్టెంబర్ 27న జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు పాఠశాల ఎంపికైంది.
ప్రథమ స్థానంలో 10వ తరగతి విద్యార్థి జి. హర్షవర్ధన్ రెడ్డి, 9వ తరగతి విద్యార్థి కే. మనోజ్ కుమార్, 8వ తరగతి విద్యార్థి బి. సుశాంత్ రెడ్డి నిలిచారు. ద్వితీయ స్థానంలో 10వ తరగతి విద్యార్థి కే. పునీత, 9వ తరగతి విద్యార్థి ఎస్. సుధీర్ కుమార్ రెడ్డి, 8వ తరగతి విద్యార్థిని డి. జోషిక నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. జయసింహారెడ్డి విజేతలను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణతో కూడిన సాధనతో పాటు ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.వరుసగా నాలుగో ఏడాది మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించడం రెయిన్బో పాఠశాల విద్యా ప్రమాణాలకు, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News