శ్రీసత్యసాయి జిల్లా, లేపాక్షి ,
లేపాక్షి మండలం బసవన్నపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తన ఒప్పో మొబైల్ ఫోన్ పోయిందని, దాని విలువ సుమారు రూ.50,000/- ఉంటుందని లేపాక్షి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ వెంటనే స్పందించి, పోలీస్ కానిస్టేబుల్ పీసీ-3663ను మొబైల్ ఫోన్ ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మొబైల్ లొకేషన్ ఆధారంగా పోయిన మొబైల్ ఫోన్ ఆచూకీని గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫిర్యాదుదారు అనిల్ కుమార్‌కు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన గుర్తించి బాధితుడికి అందజేసిన హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ మరియు తన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. తమ సెల్ ఫోను జాగ్రత్తగా భద్రపరచుకునే విధంగా చూసుకోవాలని ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సి ఐ సూచించారు.


