మూడేళ్ల ప్రేమకు పెళ్లితో ముడి.!కనేకల్లు లో ట్రాన్స్‌జెండర్ జానుతో వంశీ వివాహం..

అనంతపురం జిల్లా కనేకల్లు : మూడేళ్లుగా కొనసాగిన ప్రేమకు వివాహంతో ముడిపడింది. కనేకల్లు పట్టణంలోని ఉరవకొండ రోడ్డులో నాగులకట్ట వద్ద బుధవారం మధ్యాహ్నం ట్రాన్స్‌జెండర్ల సమక్షంలో వంశీ, జాను వివాహం ఘనంగా జరిగింది.గడుసులపల్లి గ్రామానికి చెందిన వంశీ, కోనాపురానికి చెందిన జాను (ట్రాన్స్‌జెండర్) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రేమను వివాహ బంధంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్న వారు ఇరువురి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.బుధవారం మధ్యాహ్నం అశ్వత్ నాగులకట్ట వద్ద ట్రాన్స్‌జెండర్ సమాజానికి చెందిన పలువురు సభ్యుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో వంశీ, జాను ఒకరికొకరు అంగీకారం తెలుపుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అనుష్క మాట్లాడుతూ.. వంశీ, జాను ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే వివాహం చేసుకున్నారని తెలిపారు. మూడేళ్లుగా కొనసాగిన వారి ప్రేమ చివరకు వివాహ బంధంగా మారడం ఆనందంగా ఉందన్నారు.వివాహ వేడుకకు హాజరైన ట్రాన్స్‌జెండర్ సమాజ సభ్యులు నూతన దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News