అనంతపురం జిల్లా కనేకల్లు, :
గుండెపోటు బాధితుల ప్రాణాలను రక్షించడంలో ‘స్టెమి’ ఇంజెక్షన్లు దివ్యౌషధంగా పనిచేస్తున్నాయని కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ షరీఫ్, డాక్టర్ హనీఫ్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ శ్రీ లేఖ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా మన ఆసుపత్రిలో ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 23 మందికి ఈ ఇంజెక్షన్లు ఇవ్వగా, 22 మంది ప్రాణాంతక స్థితి నుండి పూర్తిగా కోలుకున్నారు. పెద్ద ఆసుపత్రులకు తరలించేలోపు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించి రోగుల ప్రాణాలు కాపాడటంలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సేవలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


