వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి : ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు

శ్రీ సత్యసాయి జిల్లా , నల్లచెరువు

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన రిలే దీక్షలో మంగళవారం ఏడవ రోజుకు చేరుకోవడం జరిగింది నల్లచెరువు తాసిల్దార్ కార్యాలయం ముందు రిలే దీక్షలో ఉన్న వీఆర్ఏలకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆర్గనైజింగ్ కార్యదర్శి మధు నాయక్ అంగన్వాడి జిల్లా కార్యదర్శి మా బున్నీసా రిలే దీక్షలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ వీఆర్ఏలు దశాబ్దాల కాలంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా గ్రామాల్లోని ప్రజలకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు సేవలందిస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి వారికి పే స్కేల్ అమలు చేయాలని అదేవిధంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని, వీఆర్ఏలను వీఆర్వోలుగా ప్రమోషన్ కల్పించాలని వీఆర్ఏల స్థానంలో నామినేగా పనిచేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వి ఆర్ ఎల్ గా కొనసాగించాలని తదితర డిమాండ్లతో అనేక సంవత్సరాలనుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రభుత్వం కూడా వీరి బాధను పట్టించుకోవడంలేదని గత నెలలో జరిగినటువంటి విజయవాడ వీఆర్ఏల ధర్నాలో పెద్ద ఎత్తున విజయవాడ కేంద్రానికి వీఆర్ఏలు తరలి మహాధర్న నిర్వహించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సమస్యలు వినకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు వీఆర్ఏలు సిద్ధమవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు ప్రజలు పాల్గొన్నారు

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News