విజయదశమి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ… జగన్‌పై నవీన్ నిశ్చల్ తీవ్ర విమర్శలు

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం

హిందూపురం: విజయదశమి సందర్భంగా జనసేన నాయకుడు బి. నవీన్ నిశ్చల్ హిందూపురంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. తన సొంత నిధులతో పార్లమెంట్‌ పరిధిలోని దాదాపు వెయ్యి మంది మహిళలకు నూతన చీరలు పంపిణీ చేశారు. మహిళలకు స్వయంగా చీరలు అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సేవా స్ఫూర్తితోనే జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు.మరోవైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై నవీన్ నిశ్చల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు తనకు అన్యాయం చేశారని విమర్శించారు.వైసీపీ నాయకత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను ఓపికతో భరించానని నవీన్ నిశ్చల్ తెలిపారు. అవసరమైన సమయంలో వైసీపీ చేసిన అన్యాయాలను ప్రజల ముందు బయటపెడతానని హెచ్చరించారు. హిందూపురంలో వైసీపీని రాజకీయంగా తుడిచిపెట్టేలా ముందుకు సాగుతానని, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.విజయదశమి సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంతో పాటు జగన్‌మోహన్ రెడ్డిపై నవీన్ నిశ్చల్ చేసిన విమర్శలు హిందూపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News