ఈగల్ బృందం, పోలీసులచే పెనుకొండ రైల్వే స్టేషన్, రైలులో ఆకస్మిక తనిఖీలు…

శ్రీ సత్యసాయి జిల్లా… పెనుకొండ , హిందూపురం ,

ఆరు చిన్న గంజాయి ప్యాకెట్లతో వ్యక్తి పట్టివేత…

“మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తాం” –
అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్..

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ సూచనలతో, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పర్యవేక్షణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఈ చర్యల్లో భాగంగా పెనుకొండ , హిందూపురం , రైల్వే స్టేషన్‌లలో “ఈగల్ ఆన్ ట్రైన్” కార్యక్రమాన్ని హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈగల్ బృందంతో పాటు ఆర్పీఎఫ్/ఏఆర్ పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ మరియు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది కలిసి రైలులోకి ఎక్కి సుమారు అరగంట పాటు వివిధ బోగీల్లో క్షుణ్ణంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రైలులో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను గుర్తించడం, అరికట్టడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా డాగ్ స్క్వాడ్ సహాయంతో కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల సందర్భంగా ఒక వ్యక్తి వద్ద ఆరు చిన్న ప్యాకెట్లలో గంజాయి గుర్తించారు. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ మాట్లాడుతూ… రైళ్ల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందన్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఈగల్ టీమ్, డాగ్ స్క్వాడ్ మరియు పోలీస్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు.
అలాగే రైళ్లలో అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు, ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు.తనిఖీ బృందాల , ఏఎస్పీ తో పాటు, సిఐలు, అబ్దుల్ కరీం, ఈగల్ ఎస్ఐ శ్రీధర్, ఎస్ఐ రాజేష్ , పోలీస్ బృందాలు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News