దేవుడి భూములకే ఎసరు.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్థలాలపై ఆక్రమణకు యత్నాలు!

ఆలయ భూములను కాపాడాలని తహశీల్దార్‌కు కమిటీ సభ్యుల వినతి

ఆక్రమణలను అడ్డుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిక

ఏపీ అక్షర విజయం న్యూస్, నవంబర్ 09, పామిడి:మండల కేంద్రంలోని నాలుగో వార్డులో కొలువుదీరిన పురాతన శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములకు ఆక్రమణల ముప్పు పొంచి ఉందని ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు అత్యవసరంగా సమావేశమై ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. తరతరాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన స్థలాలు ఉత్సవాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు వేదికగా ఉన్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు దేవాలయానికి సంబంధించిన అన్ని భూములను ఆక్రమణల నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.ఆలయ భూములను కాపాడాలి.. లేకుంటే ఆందోళన తప్పదు!దేవాలయ భూముల సరిహద్దులను తక్షణమే గుర్తించి, భూముల వివరాలను పరిశీలించి ఆక్రమణలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ఆలయ ఆస్తులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అంజినేయులు, ప్రచండ, నవీన్, రమేష్, ఆది, రవి, మధు, బబ్లూ, కార్తీక్, చరణ్, ప్రభాకర్, రామాంజినేయులు, చంద్రబాబు తదితరులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News