అనంతపురం జిల్లా:
*కూటమి నాయకులు బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణమ్మ ఖరారు*
ఏపీ అక్షర విజయం న్యూస్, అక్టోబరు 25,కనేకల్లు:
రాయదుర్గం శాసనసభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కణేకల్లు మండలంలో కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ఆదివారం ఒక కొలిక్కి వచ్చింది. ఇందులో భాగంగా బ్రహ్మసముద్రం, 43 ఉడేగోళం గ్రామాల ఎంపీటీసీ స్థానానికి భారతీయ జనతా పార్టీ నాయకురాలు అరుణమ్మను కూటమి బలపరిచిన అభ్యర్థిగా నాయకులు ఖరారు చేసారు.ఈ మేరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు కలిసి అరుణమ్మకు అవకాశం కల్పించారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ హుండాల హనుమంతరెడ్డి,భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సంధిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు, జిల్లా ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణరెడ్డి, మార్కెట్ యార్డు సంచాలకుడు తిమ్మారెడ్డితో పాటు బ్రహ్మసముద్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు అరుణమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై, కూటమి నాయకులను కలుపుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాలకు ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని అరుణమ్మ కోరారు.


