జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్

శ్రీ సత్యసాయి,పుట్టపర్తి

జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి ఇళ్లలో వెలుగులు నింపి, అనుకున్న లక్ష్య సాధనలో విజయాలను ప్రాప్తింపజేయాలని కోరుకుంటున్నాను.”

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను మనం జరుపుకుంటామని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, విజయాలను నింపాలని ఆకాంక్షించారు.

శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నారు.

పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాలనా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజలందరి సహకారంతో జిల్లాను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని పేర్కొన్నారు

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News