సత్యసాయి జిల్లా, ధర్మవరం
జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా కొండా దుర్గమ్మ ఎంపిక.
ధర్మవరం, అక్టోబర్ 12.అక్షర విజయం :-
జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా కొండా దుర్గమ్మను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహములో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు ఈ కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కార్యాలయ వర్గాలు తెలిపారు. అనంతరం కొండా దుర్గమ్మ మాట్లాడుతూ జనసేన పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యతను పార్టీ అభివృద్ధి కొరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో తన వంతుగా సహకరిస్తానని వారు స్పష్టం చేశారు. ఈ ఎంపికకు సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.



