పుట్టపర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం : ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

పుట్టపర్తి :

పుట్టపర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం

ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..

ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, వ్యతిరేకత రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగుల పని తీరే

మనమంతా కలిసి కట్టుగా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిద్దాం

పుట్టపర్తి స్వర్ణ వార్డు ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి.

పుట్టపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా అధికారులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

సోమవారం జానకీ రామయ్య కళ్యాణ మండలం లో సోమవారం పుట్టపర్తి స్వర్ణ వార్డు ఉద్యోగులు, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు.

ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా సత్వరమే స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని సూచించారు.

ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

పుట్టపర్తి పట్టణ అభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సేవలందించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ, పుట్టపర్తి పట్టణాన్ని సమష్టి కృషితో ప్రగతి పథంలో నడిపించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,మున్సిపల్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News