అనంతపురం
నిరంతరం వార్తల వెంటే పరుగెడుతూ, కెమెరా లెన్సుల వెనుక, డిజిటల్ స్క్రీన్ల ముందు గంటల తరబడి కళ్ళు అప్పగించి పనిచేసే జర్నలిస్టుల కంటి వెలుగును కాపాడేందుకు అనంతపురం ప్రెస్ క్లబ్ అడ్ హాక్ కమిటీ మరియు డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి కలిసివర్కింగ్ జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచిత కంటి వైద్య సౌకర్యాన్ని అందించడం కోసం ముందుకొచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య సౌకర్యం పొందేందుకు ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో కూపన్లు పంపిణీ చేశారు. అనంతపురం ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించారు. ఈ నెల (అక్టోబర్) 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్కింగ్ జర్నలిస్టులు ఈ సౌకర్యాన్ని వినియోగించు కావాలన్నారు. అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోగల జూడియో వస్త్ర దుకాణం పైభాగంలో ఉన్న డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రినందు సంప్రదించి ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కంటి ఆసుపత్రిలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక కూపన్, అదనపు వ్యక్తులకు వేరుగా మరో కూపన్ మేరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ కూపన్ల పంపిణీ కార్యక్రమంలో అనంతపురం ప్రెస్ క్లబ్ అడ్ హక్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లెబోయిన రామాంజనేయులు, కోశాధికారి కొత్త పల్లి. అనిల్ కుమార్ రెడ్డి, సభ్యులు కేపీ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ లు అమినేని రవిచంద్ర, డాక్టర్ సూర్య, డేవిడ్ (బాలవెంకటయ్య), సాక్షి శంకర్, హిందూ ఫోటోగ్రాఫర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


