జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

అనంతపురం జిల్లా, కనేకల్లు :


జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. కనేకల్లు మండల ఉపాధ్యాయ సంఘం (ఏపీటిఎఫ్ )ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లోని హెచ్‌ఎల్‌సీ పాఠశాలలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివైఇఓ, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మన్న1, భవానీ శంకర్‌ 2ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన కణేకల్‌ మండలంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కె.వి. రాఘవమ్మ, హెచ్‌ఎల్‌సీ కణేకల్లు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం. ఈరమ్మ, తుంబిగనూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. సోమశేఖర్‌, గరుడచేడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి. విజయ్‌కుమార్‌లను మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు ఘనంగా సత్కరించారు. డివైఈవో,
మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మన్న1, భవానీ శంకర్‌2 అవార్డు గ్రహీతలకు శాలువాలు, పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యాభివృద్ధితో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం వారి సేవలకు దక్కిన గుర్తింపుగా పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
అవార్డు గ్రహీతలు తమకు లభించిన గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల అభ్యున్నతికి మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మండలం లోని పలు పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, సి ఆర్ పి లు, ఎమ్ ఆర్ సి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News