శ్రీ సత్యసాయి జిల్లా : నంబులపూలుకుంట
కదిరి నియోజకవర్గం నంబుల పూలు కుంట మండల పరిధిలోని దిగువ గూటిబైలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారి పుట్టినరోజు సందర్భంగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ జయరాం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు,గర్భవతులకు, చిన్నారులకు, పాలు పండ్లు, కాయలు, బెడ్లు , దళిత గ్రామ పెద్దలతో కలిసి వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా జాతీయ స్థాయిలో విద్యార్థులకు అనేక సమస్యల దాదాపు 15 సంవత్సరాల పాటు ఎన్నో సేవలు అందించారని,భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నాయకుడిగా ఉద్యమనేతగా పార్టీకి ఎన్నో సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి మా గ్రామస్తులతో కలిసి ఇంత పెద్ద ఎత్తున వేడుకలు జరుపు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఇంకా మున్ముందు ఉన్నత బాధ్యతలు పదవులు చేపట్టి పేద దళిత ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదింప చేయాలని గ్రామ ప్రజలు కోరారు . ఈ వేడుకలలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రెడ్డప్ప, కూటమి నాయకులు రామాంజులు, అదెప్ప, దేవేంద్ర, గంగాద్రి, కృష్ణమూర్తి, నరసింహులు, ఆంజనేయులు, శ్రీరాములు, భాస్కర్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


