అంగన్వాడి ఉత్సవం

అనంతపురం జిల్లా, కనేకల్లు:-

ఏపీ అక్షర విజయం న్యూస్, సెప్టెంబర్ 26,

కనేకల్లు :భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకొని శనివారం కనేకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొట్టాల వీధి 9వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.కనేకల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎ.నాగమణి ఆదేశాల మేరకు 9వ అంగనవాడి కేంద్రం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ అంగన్వాడీ కేంద్ర కార్యకర్త జ్యోతి మాట్లాడుతూ.అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడం, పిల్లల ఆరోగ్యం–పోషణ–ప్రారంభ బాల్య విద్యకు సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా అందించడం ఈ అంగన్వాడీ ఉత్సవం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో 7 వ అంగన్వాడి కార్యకర్త యశోద, 16 వ కేంద్రం కార్యకర్త నాగరత్నమ్మ, 13వ కేంద్రం కార్యకర్త రాధిక, ఆశా వర్కర్ రాధమ్మ, ఆయా వన్నూరు బి, ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News