శ్రీ సత్యసాయి జిల్లా , కదిరి
రిపోర్టర్ : సాగర్
• కుప్పం నుంచి మున్సిపల్ HAM ప్రాజెక్టులకు వర్చువల్ శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
కదిరి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి చేపట్టనున్న HAM ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని గర్ల్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న తాయి గ్రాండ్లో కదిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
కదిరి మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ.29 కోట్ల HAM నిధులతో కదిరి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అభివృద్ధే కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధానం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, “కదిరి పట్టణానికి దాదాపు రూ.29 కోట్ల HAM నిధులు తీసుకురావడం మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులతో ప్రజలకు సమాధానం చెప్పే కూటమి ప్రభుత్వ విధానానికి నిదర్శనం” అని అన్నారు.
“గతంలో అధికారంలో ఉన్నవారు అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా ప్రజల ముందున్న వాస్తవం ఏమిటో ప్రజలే గమనించారు. ఇప్పుడు కదిరి పట్టణానికి భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. ప్రజలకు కావాల్సింది రాజకీయ విమర్శలు కాదు.. అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమం. కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోంది” అని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
“సీటు ఎవరికి వచ్చినా అభ్యర్థి ఒక్కరే కాదు.. కూటమి అభ్యర్థి. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి” అని అన్నారు.
“వైసీపీకి కదిరిలో రాజకీయంగా ప్రజల నుంచి మద్దతు లేదని, గత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని” ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి నాయకులు సమష్టిగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆయన అన్నారు.
“వైసీపీ రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెప్పి అభివృద్ధి వైపు చూస్తున్నారు. కదిరి అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు కేవలం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే మా సమాధానం” అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కదిరి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు.




