మద్యం మత్తులో ప్రమాదం.. గుంతలో పడి వృద్ధుడి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా , ఓబుల దేవర చెరువు ,గౌనిపల్లి

మద్యం సేవించి ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గుంతలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం గౌనిపల్లిలో చోటుచేసుకుంది. మద్యం సేవించి ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గుంతలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం గౌనిపల్లిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చాకలి నాగేష్ (64)కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ వివాహాలు కాగా, బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమారు నాలుగు రోజుల క్రితం నాగేష్ స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈక్రమంలో రాత్రి సమయంలో మద్యం సేవించిన ఆతను ఇంటికి వెళ్తుండగా, విద్యుత్‌ అధికారులు స్తంభం ఏర్పాటు కోసం తవ్వించిన గుంతలో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు

విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం

విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాల కోసం తీసిన గుంతలను స్తంభం ఏర్పాటు చేసి వెంటనే పూడ్చివేయాల్సిన ఉండగా మధ్యలో ఇలా గుంతలు తీసి పూడ్చి వేయకుండా నిర్లక్ష్యం వహించడం వలన రాత్రి సమయంలో అందులో పడి మృతి చెందాడని దీనికి కారణం విద్యుత్ అధికారులేనని గ్రామస్తులు మండిపడ్డారు ఘటనపై సంబంధిత పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News