అనంతపురం జిల్లా ,ధర్మవరం,
అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్ కే డి వి ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ఎక్సైజ్ కార్యాలయంలో అనంతపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ హర్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూమద్యం దుకాణ లైసెన్స్ రెన్యువల్ మీద లైసెన్సు దారులతో కొన్ని విషయాలను చర్చించారు.దుకాణల రెన్యువలును ప్రస్తుతం ఉన్న ఫీజు మీద ప్రభుత్వం 38 శాతము పెంచి రెన్యువల్ చేసిందన్నారు. చివరి తేది సెప్టెంబర్ 21 వరకు గడువు నిర్ణయించ డమైనదని తెలిపారు.తద నంతరం లైసెన్స్ దారులు సకాలంలో మద్యం దుకాణం రెన్యువల్ చేసుకోవాలని, రెన్యువల్ చేసుకోకుండా మిగిలిన మద్యం దుకాణాలకు ఈ నెల 22 తేది నుండి నోటిఫికేషన్ ద్వారా టెండర్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ చంద్రమణి పాల్గొన్నారు.



