ట్రెల్లిస్ స్కూల్లో జరిగిన.. ఘటన.. కు.. అసలు సూత్రధారులు ఎవరు…!

అనంతపురం

ట్రెల్లిస్ స్కూల్లో జరిగిన.. ఘటన.. కు.. అసలు సూత్రధారులు ఎవరు…!

  • ఆపన్నహస్తం కోసం వెళితే… న్యాయానికి సంకెళ్లు వేస్తారా…
  • కంచె చేను మేసిన దౌర్భాగ్యం..

మీడియా…పోలీసుల మిలాఖత్ తో బాలికకు తీవ్ర అన్యాయం?

కేసును నీరు కార్చడానికి ట్రెల్లిస్ స్కూల్ యాజమాన్యం శకుని పాచికలు వేసిందా…

బాలికను అండగా నిలవాల్సిన పాఠశాల యాజమాన్యం….
కుటిల రాజకీయాలు చేయడం తగునా..?


అనంతపురం నగర నడిబొడ్డులోని
ట్రెల్లిస్ స్కూల్లో ముక్కుపచ్చలారని ఓ బాలికపై ఓ కామాంధుడు, కీచక పర్వానికి తెరలేపి ఆ బాలికపై ఈనెల రెండవ తేదీన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్మృతి పదం నుంచి చెరిగిపోక ముందే జరిగిన ఈ అమానుష సంఘటనను తొక్కి పెట్టడానికి పెట్టడానికి ఇటు మీడియా అటు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బాలికపై జరిగిన ఘటనను బయటికి పొక్కకుండా ఉండడానికి, నజరానాగా రూ ఐదు లక్షలు ముడుపులు తీసుకుని, బాలిక తల్లిదండ్రులను సైతం మీడియా ముందుకు అటు జిల్లా పోలీస్ శాఖ అధికారుల వద్దకు సైతం రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక మీడియాలోని ప్రధాన పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరు..? ఈ తతంగం మొత్తం తెరవెనుకనుండి నడిపిస్తున్న అసలు దర్శకుడు ట్రెల్లిస్ స్కూల్ యాజమానేనన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేవలం తమ స్కూలుకు చెడ్డ పేరు వస్తుందన్న కోణంలో, మరోవైపు నిందితుడిని తప్పించే దిశలోను ఈ తతంగమంతా నడిపిస్తున్నారన్న ఆరోపణలు సర్వోత్తర వ్యక్తం అవుతున్నాయి. ఓ ముక్కుపచ్చలారని బాలికపై అందులో తమ పాఠశాలలోనే చదువుతున్న ఆ బాలికపై ఇంత అమానుష ఘటన జరిగితే బాలికకు అండగా నిలవాల్సింది పోయి స్కూలు యాజమాన్యం చేస్తున్న కుతంత్రం అంతా ఇంత కాదన్నా వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియకపోవడం కొసమెరుపుగా నిలుస్తోంది… వాస్తవానికి బాలిక పై జరిగిన అమానుష సంఘటనకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి తమ వంతు బాధ్యతగా బాలికకు, తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన మీడియా, పోలీసుల పై ఎంతైనా ఉందని పలువురు మేధావులు ప్రజాసంఘాలు ఘంటా పతంగా చెబుతున్నాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ కేసు నుండి అవతలి వ్యక్తిని తప్పించే ఇందుకు వీరు చేసిన శకుని తంత్రాంగం.. మంత్రాంగం అంతా ఇంత కాదన్నా వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫోక్సు లాంటి అతి పెద్ద కేసుల వ్యవహారం ప్రధాన కార్యాలయం నుండి ఎడిటర్ల అనుమతితోనే ప్రసారమైతాయన్నది జగమెరిగిన సత్యం. అంతేకాక బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కఠినమైన శిక్షలు అమలు అయ్యేలా జీవో సైతం స్పష్టంగా ఉంది. ఇలాంటి సంఘటన ఆ పాఠశాలలో జరిగితే పాఠశాల యాజమాన్యం స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడితో ప్రముఖ మీడియాలో పనిచేస్తున్న జిల్లా ప్రతినిధులు తో సంప్రదింపులు జరిపి ఈ సంఘటన బయటకు రాకుండా చూడాలనుకున్నారు.. ఇందులో ఓ ప్రముఖ జర్నలిస్ట్ యూనియన్ కు చెందిన జిల్లా స్థాయి నాయకుడిగా ఉంటూ ఆ ముసుగులో నుండి ఈ తతంగమంతా నడిపారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.. అదే విషయం బాధితురాలి తల్లి అనంతపురం కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా వారి పేర్లు తో సహా తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ కేసును నీరు కార్చే అసలైన దోషులు ఎవరనేది జగమెరిగిన సత్యం . అయితే ఈ కేసులో జరుగుతున్న అవినీతి తంతు ప్రస్తుతం బాహ్య ప్రపంచానికి అందరికీ తెలియడంతో.. ప్రస్తుతం ప్రధాన మీడియా ఎడిటర్లు డిఫెన్స్ లో అనగా అంతర్మాతరంలో పడ్డారు అన్నది వాస్తవం. ఈ విషయంలో తమకు తీవ్ర అన్యాయం చేశారని తమకు న్యాయం జరగలేదంటూ బాలిక తల్లి మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఆనంద ను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. మరో అడుగు ముందుకు వేసి ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు హోం శాఖ మంత్రి అనిత సైతం కలిసి నిందితునికి శిక్ష పడేలా చేస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News