అమరావతి
మంత్రులు, కలెక్టర్లు, అధికారుల ఫైళ్ల క్లియరెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.
ఫైళ్ల క్లియరెన్సును సరైన సమయంలో క్లియర్ చేయకపోవటంపై అధికారులకు క్లాస్ తీసుకున్న ముఖ్యమంత్రి.
కలెక్టర్ల కాన్ఫరెన్సుకు హాజరు కాని అధికారులపై సీఎం ఆగ్రహం.
అధికారుల గైర్హజరుపై వివరణ తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి ఆదేశం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
• పాలన వేగంగా జరగాలంటే ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని పదేపదే చెబుతున్నాం.
• ఐఎఎఎస్ అధికారుల 360 డిగ్రీల నివేదికను కూడా అందరి అభిప్రాయాలు తీసుకుని తయారు చేస్తాం.
• కలెక్టర్ల సదస్సుకు కూడా కొందరు అధికారులు హాజరు కావడం లేదు. వీళ్ల ధైర్యమేంటీ..?
• రెండు రోజులు అంతకంటే తక్కువ సమయంలో క్లియర్ చేసిన అధికారులందరికీ అభినందనలు
• జీరో డే లోనే పూర్తి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు.
• 4 రోజుల సమయం తీసుకుంటున్న మంత్రులు వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలి.
• కార్యదర్శుల క్షేత్రస్థాయి పర్యటన తప్పనిసరిగా చేయాల్సిందే.
• ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చినప్పుడే పనితీరు సవరించుకోగలం.
• అన్ని ప్రభుత్వ శాఖలూ ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఫైళ్ల నిర్వహించాలి.. దీనికి నెలరోజులే గడువు.
• మాన్యువల్ ఫైళ్లు రన్ చేస్తే ఇక నుంచి తీవ్రంగా పరిగణిస్తాం.
• మాన్యువల్ ఫైల్స్ నిర్వహణపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి. మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టాలి.





