త్రాగడానికి నీరు లేక అల్లాడుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు… చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…

అనంతపురం జిల్లా , పామిడి మండలం

త్రాగడానికి నీరు లేక అల్లాడుతున్న ప్రజలు…. పట్టించుకోని అధికారులు… చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని రామగిరి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభువు అని వేడుకుంటున్న ప్రజలు..

పామిడి నీరు లేక విలవిలలాడుతున్న ప్రజల గోడు అధికారులకు కనిపించలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే పామిడి మండలం రామగిరి గ్రామం నందు గత నాలుగు రోజుల నుంచి నీరు రాలేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో నీటి సరఫరా రెండు బోర్ల నుంచి వస్తున్నప్పటికీ మోటర్ పనిచేయలేదు అని స్థానిక స్కూల్ ఉపాధ్యాయులు ప్రజలు కుళాయిలో నీరు రాలేదని గ్రామ సచివాలయ కార్యాలయం అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఉపాధ్యాయులు ప్రజలు వాపోతున్నారు. విద్యార్థులకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ అధికారి కూడా స్పందించిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్రాగునీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Related News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News