About

మా గురించి / About

AP AKSHARA VIJAYAM | ఏపీ అక్షర విజయం
ఏపీ అక్షర విజయం (AP AKSHARA VIJAYAM) ప్రజల గొంతుకగా, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చే తెలుగు దినపత్రిక.
ప్రజా సమస్యలు, రాజకీయాలు, క్రైమ్, విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక పరిణామాలు మరియు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ప్రజలకు అందించడమే మా ప్రధాన లక్ష్యం.
వాస్తవాలకు ప్రాధాన్యత – ప్రజా సమస్యలకు ప్రతిధ్వని – బాధ్యతాయుత జర్నలిజం అనే సూత్రాలతో మా వార్తా సంస్థ పనిచేస్తుంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము.
“నిజమైన వార్తలు… నిజమైన ప్రభావం” అనే నమ్మకంతో, వార్తలను వీలైనంత స్పష్టంగా, సమతుల్యంగా మరియు బాధ్యతాయుతంగా ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్నాము.

మా లక్ష్యం..
అక్షరం మా ఆయుధం – విజయం మా లక్ష్యం..
ప్రజా ప్రయోజనమే మా ప్రాధాన్యత. నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన మరియు బాధ్యతాయుతమైన జర్నలిజం ద్వారా సమాజానికి సేవ చేయడం మా లక్ష్యం.
AP AKSHARA VIJAYAM
తెలుగు దినపత్రిక
Real News. Real Impact.