ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి : జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్

శ్రీ సత్యసాయి జిల్లా , పుట్టపర్తి,

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 337 అర్జీలు స్వీకరణ


ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 337 అర్జీలు రాగా, వాటిపై తగు చర్యలు తీసుకుని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ,ఎస్‌డిసి విజయ కుమారి తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.